HomeతెలంగాణTelangana Election Results 2024: కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్.. సీఎం రేవంత్ హవా తగ్గిందా..?

Telangana Election Results 2024: కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్.. సీఎం రేవంత్ హవా తగ్గిందా..?

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 17 పార్లమెంట్ స్థానంలో 14 సీట్లు గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. కానీ బీజేపీ అనూహ్యంగా గట్టి పోటీ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. MIM 1వ స్థానంలో ఉంది. BRS బోను కొట్టలేదు. కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గడంతో సీఎం రేవంత్ హవా తగ్గిందని చర్చ సాగుతోంది. అలాగే మల్కాజిగిరి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ భారీ ఆధిక్యం లో దూసుకెళ్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పోటీ చేసిన ఈ స్థానంలో బీజేపీ ఆధిక్యంలో ఉండటంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్‌లోన డీకే అరుణ కాంగ్రెస్ అభ్యర్థుల కంటే ముందంజలో ఉన్నారు. ఇది రేవంత్ కి గట్టి ఎదురు దెబ్బ అని చెప్పాలి.

Recent

- Advertisment -spot_img