HomeరాజకీయాలుTelangana Elections : కాంగ్రెస్​కు మరో షాక్

Telangana Elections : కాంగ్రెస్​కు మరో షాక్

– పార్టీకి రాజీనామా చేసి పీసీసీ వైస్ ప్రెసిడెంట్ గాలి అనిల్ కుమార్

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతల ఒంటెద్దు పోకడలతో విసుగు చెందిన నాయకులు, కార్యర్తలు ఒక్కొక్కరు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ గాలి అనిల్ కుమార్ హస్తం పార్టీకి గుడ్​ బై చెప్పారు. ఆయనతో పాటు పది మంది నాయకులు కూడా పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినా తనకు సరైన గుర్తింపు లభించలేదన్నారు. తాను పార్టీ కోసం పని చేసి అన్ని విధాల నష్టపోయాయని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలు, అభిమానుల సూచనమేరకు కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img