Homeహైదరాబాద్latest NewsTelangana Elections : జనం కోసమే తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరం

Telangana Elections : జనం కోసమే తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరం

– అన్ని పార్టీల్లో దొంగలుంటారు
– అలాంటి వాళ్లు సీఎం కాకూడదు
– వైసీపీ నేత సజ్జల ఏపీలోని సమస్యలపై ఫోకస్ పెడితే బెటర్
– వైఎస్సార్టీపీ చీఫ్​ షర్మిల కీలక వ్యాఖ్యలు


ఇదే నిజం, హైదరాబాద్: జనం కోసమే తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నామని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఎవరో తమకు కిరీటాలు పెట్టాలని కోరుకోవడం లేదన్నారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై కేసు కొట్టేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. అన్ని పార్టీల్లో దొంగలుంటారని.. కానీ ఆ దొంగలు సీఎంలు కాకూడదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి షర్మిల పలు వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్టీపీతో సంబంధం లేదని గతంలో సజ్జల అన్నారని.. ఇప్పుడు ఏ సంబంధం ఉందని తన గురించి ఆయన మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తాము మాత్రం సంబంధం లేదనే అనుకుంటున్నామని తెలిపారు. ‘మా పార్టీతో సంబంధం గురించి సజ్జలే సమాధానం చెప్పాలి. ఏపీలో రోడ్లు, విద్యుత్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్‌ బాహాటంగానే విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై సజ్జల ఏం సమాధానం చెబుతారు?సజ్జల గారూ.. ముందు మీ కథ మీరు చూసుకోండి’అని షర్మిల సెటైర్ చేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img