HomeరాజకీయాలుTelangana Elections : Congress ​కు నీలం మధు GoodBye..!

Telangana Elections : Congress ​కు నీలం మధు GoodBye..!

– తన అనుచరులతో కలిసి బీఎస్పీలో చేరిక
– పటాన్​ చెరు నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీకి పటాన్​చెరులో బిగ్​ షాక్ తగిలింది. పటాన్ చెరు నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో నీలం మధు ఆ పార్టీకి గుడ్​ బై చెప్పారు.తన అనుచరులతో కలిసి బీఎస్పీలో చేరారు. బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​లోకి వచ్చిన నీలం మధును హస్తం పార్టీ తొలుత పటాన్‌చెరు అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బీఫామ్‌ను పెండింగ్‌లో పెట్టింది. అయితే, గురువారం రాత్రి ప్రకటించిన చివరి జాబితాలో నీలం మధుకు బదులు కాటా శ్రీనివాస్‌కు టికెట్‌ ఇచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. .. బీఎస్పీ అభ్యర్థిగా పటాన్​చెరు టికెట్‌ను ఖరారు చేసుకున్నారు. ఆ పార్టీ తరఫున నామినేషన్‌ కూడా దాఖలు చేశారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలోకి ఎవరు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు బయటకు వెళ్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. నారాయణ్‌ఖేడ్‌ అభ్యర్థిని కూడా పార్టీ అధిష్ఠానం మార్చింది. గతంలో ప్రకటించిన సురేశ్‌ షెట్కర్‌ బదులు సంజీవ్‌ రెడ్డికి టికెట్‌ కేటాయించింది. ఇక సూర్యాపేటలోనూ పటేల్‌ రమేశ్‌ రెడ్డిని కాదని సీనియర్‌ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డికి టికెట్‌ ఇచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న రమేశ్‌ రెడ్డి.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.

Recent

- Advertisment -spot_img