Homeహైదరాబాద్latest NewsTelangana Elections: Second list of Congress released Telangana Elections : Congress​ రెండో...

Telangana Elections: Second list of Congress released Telangana Elections : Congress​ రెండో జాబితా విడుదల

– 45 మందితో సెకండ్​ లిస్ట్​

– మరో 19 నియోజకవర్గాలు పెండింగ్​

– ప్యారాచూట్​ లీడర్లకు నాలుగు సీట్లు

– బల్మూరి వెంకట్​, విష్ణువర్దన్​రెడ్డి, గాలి అనిల్​కుమార్​కు భంగపాటు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. మొత్తం 45 మందితో రెండో జాబితాను ఆ పార్టీ శుక్రవారం చేసింది. 55 మందితో ఇటీవల తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య వందకు చేరింది. ఇంకా 19 నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి లాంటి పార్టీలకు కూడా మూడవ జాబితాలోనే సీట్లు ఫైనల్ కానున్నాయి. వచ్చే నెల 3న నోటిఫికేషన్ జారీ కానుండడంతో రెండుమూడు రోజుల్లోనే పెండింగ్‌లో ఉన్న సీట్లను కూడా ఖరారు చేయనున్నారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డికి రెండో జాబితాలో అవకాశం కల్పించారు.

రెండో జాబితాలో అభ్యర్థులు వీరే..

  1. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా:

ఆదిలాబాద్ కంది శ్రీనివాసరెడ్డి

బోథ్ బాపూరావ్ రాథోడ్

ముధోల్ భోస్లే నారాయణ రావ్ పటేల్

సిర్పూర్ రావి శ్రీనివాస్

ఆసిఫాబాద్ అజ్మీరా శ్యామ్

ఖానాపూర్ ఎడ్మ బొజ్జు

  1. నిజామాబాద్ జిల్లా:

నిజామాబాద్ (గ్రామీణ) రేకులపల్లి భూపతిరెడ్డి

ఎల్లారెడ్డి మదన్‌మోహన్‌రావ్

  1. కరీంనగర్ జిల్లా:

చొప్పదండి మేడిపల్లి సత్యం

హుజురాబాద్ ఒడితెల ప్రణవ్

కోరుట్ల జువ్వాడి నర్సింగరావ్

హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్ గౌడ్

  1. వరంగల్ జిల్లా:

జనగాం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

పరకాల రేవూరి ప్రకాశ్ రెడ్డి

వరంగల్ వెస్ట్ నాయిని రాజేందర్ రెడ్డి

వరంగల్ ఈస్ట్ కొండా సురేఖ

వర్థన్నపేట కేఆర్ నాగరాజు

పాలకుర్తి ఎం యశస్విని

మహబూబాబాద్ డాక్టర్ మురళీ నాయక్

  1. మెదక్ జిల్లా:

నర్సాపూర్ ఆవుల రాజిరెడ్డి

సిద్దిపేట పూజల హరికృష్ణ

దుబ్బాక చెరుకు శ్రీనివాసరెడ్డి

  1. రంగారెడ్డి జిల్లా:

తాండూర్ బుయ్యని మనోహర్ రెడ్డి

ఇబ్రహీంపట్నం మల్‌రెడ్డి రంగారెడ్డి

ఎల్బీనగర్ మధు యాష్కీ

మహేశ్వరం కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

రాజేంద్రనగర్ కస్తూరి నరేందర్

శేరిలింగంపల్లి జగదీశ్వర్ గౌడ్

కూకట్‌పల్లి బండి రమేశ్

  1. హైదరాబాద్ జిల్లా:

అంబర్‌పేట్ రోహిన్ రెడ్డి

ఖైరతాబాదు పి.విజయారెడ్డి

జూబ్లీహిల్స్ అజారుద్దీన్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ డాక్టర్ గుమ్మడి వెన్నెల

  1. మహబూబ్‌నగర్ జిల్లా:

నారాయణ్ పేట్ డాక్టర్ పర్ణిక చిట్టెంరెడ్డి

మహబూబ్‌నగర్ ఎన్నం శ్రీనివాసరెడ్డి

జడ్చర్ల అనిరుధ్ రెడ్డి

దేవరకద్ర జి మధుసూధన్ రెడ్డి

మక్తల్ వాకిటి శ్రీహరి

వనపర్తి జి. చిన్నారెడ్డి

  1. నల్లగొండ జిల్లా:

దేవరకొండ బాలూ నాయక్

మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి

  1. ఖమ్మం జిల్లా:

పినపాక పాయం వెంకటేశ్వర్లు

ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు

పాలేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img