HomeరాజకీయాలుTelangana Elections : BJPకి తుల ఉమ రాజీనామా

Telangana Elections : BJPకి తుల ఉమ రాజీనామా

– వేములవాడ టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకోవడంపై మనస్తాపం


ఇదే నిజం, హైదరాబాద్: బీజేపీకి తుల ఉమ రాజీనామా చేశారు. వేములవాడ అసెంబ్లీ టికెట్‌ ఇచ్చినట్లే ఇచ్చి చివరి నిమిషంలో వెనక్కి తీసుకోవడంపై ఆమె మనస్తాంపం చెందారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు. బీజేపీలో చేరినప్పటి నుంచి పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తనవంతు కృషి చేశానని, పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా తనకు వేములవాడ అసెంబ్లీ టికెట్‌ ఇచ్చారని, అయితే ఆఖరి నిమిషంలో వేరేవాళ్లకి బీఫామ్‌ ఇచ్చి తనను అవమానించారిన తుల ఉమ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. దీన్ని తన ఒక్కదానికి జరిగిన అవమానం కాదని, తన గొల్ల కురుమ జాతికి జరిగిన అవమానంగా భావిస్తున్నానని ఉమ తెలిపింది. బీసీ నాయకురాలికి టికెట్‌ ప్రకటించి బీఫామ్ ఇవ్వని మీరు.. బీసీ నినాదంతో ముందుకు పోతామనం విడ్డూరంగా ఉందని లేఖలో ఎద్దేవా చేశారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే మీరు బీసీ మహిళనైన తనను అవమానించడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. కాగా, తన వెంట నడిచే ప్రజలు, కార్యకర్తలతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని తుల ఉమ తెలిపారు.

Recent

- Advertisment -spot_img