– ఈటలకు షాక్.. పంతం నెగ్గించుకున్న బండి
– మొదట తుల ఉమ పేరును ప్రకటించిన అధిష్టానం
– చివరి రోజు నిర్ణయాన్ని మార్చుకున్న కమలం పార్టీ
– వికాస్ రావుకు బీ ఫామ్ ఇచ్చిన బండి సంజయ్
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: నామినేషన్ల చివరి రోజున వేములవాడ బీజేపీ టికెట్ విషయంలో పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్నాయి. తొలుత తుల ఉమను అభ్యర్థిగా ప్రకటించిన అధిష్టానం.. శుక్రవారం మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కొడుకు వికాస్‌రావును అభ్యర్థిగా ఖరారు చేస్తూ బీఫామ్ ఇచ్చింది . ఈటల రాజేందర్ అనుచరురాలు తుల ఉమకు తొలుత వేములవాడ టికె
ట్ను బీజేపీ ఖరారు చేసింది. అయితే, వికాస్ రావుకు టికెట్ కేటాయించాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ గట్టిగా పట్టుబట్టడంతో అధిష్టానం సందిగ్ధంలో పడిపోయింది. మొత్తానికి శుక్రవారం ఈ టెన్షన్ వీడింది. వికాస్ రావుకు వేములవాడ టికెట్ కేటాయిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే, ఇప్పటికే ఆ స్థానం నుంచి తుల ఉమ నామినేషన్ కూడా వేసేశారు. అయితే తాజాగా వికాస్‌రావుకు బీజేపీ అధిష్టానం బీఫామ్ ఇచ్చింది.