Homeహైదరాబాద్latest Newsతెలంగాణ 'ఫ్యామిలీ డిజిటల్ కార్డ్' .. ఇది ఎలా పనిచేస్తుందంటే ..?

తెలంగాణ ‘ఫ్యామిలీ డిజిటల్ కార్డ్’ .. ఇది ఎలా పనిచేస్తుందంటే ..?

తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు పేరుతో కొత్త డిజిటల్ కార్డును అందుబాటులోకి తీసుకురాబోతుంది తెలంగాణ ప్రభుత్వం. డిజిటల్ కార్డ్ అప్లికేషన్స్ ను దసరా నుంచి ప్రజల స్వీకరించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో మహిలను ఇంటి ఓనర్ గా గుర్తిస్తారట. ఈ కార్డుతో రేషన్, పింఛను, ఆరోగ్య ఇతర పథకాలను ఈజీగా పొందవచ్చని చెబుతున్నారు. అర్హులందరికీ ఒకే రాష్ట్రం ఒకే కార్డుతో ముందుకు తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన సర్వే కూడా ప్రభుత్వం మొదలు పెట్టింది. రానున్న రోజుల్లో అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సర్వే చేయనున్నారు. అధికారులు ఇంటింటికి వెళ్లి ఫ్యామిలీ యజమాని మహిళతో పాటు ఇతర కుటుంబ సభ్యుల వివరాలను సేకరించనున్నారు. ఆ వివరాలతో ఆ కుటుంబానికి ఓ క్యూర్ కోడ్ కేటాయిస్తారు. దీని ద్వారానే అర్హత కలిగిన వారికి పథకాలు అందజేయనున్నారు.

Recent

- Advertisment -spot_img