Telangana Government Employees: తెలంగాణ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పనివేళలకు సంబంధించి కీలక సవరణలు చేసింది. కొత్త ఉత్తర్వుల ప్రకారం, ఉద్యోగులు రోజుకు గరిష్ఠంగా 10 గంటల వరకు పని చేయడానికి అనుమతి ఉంటుంది. అయితే, వారంలో మొత్తం పనివేళలు 48 గంటలను మించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఈ పరిమితిని దాటి పని చేయించినట్లయితే, యజమానులు ఓవర్‌టైమ్ (ఓటీ) వేతనం చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే, రోజులో 6 గంటల పని తర్వాత కనీసం అరగంట విశ్రాంతి సమయం ఇవ్వాలని, మొత్తం పనివేళలు విశ్రాంతి సమయంతో కలిపి 12 గంటలను మించరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సవరణలు వాణిజ్య సంస్థల్లో పని వాతావరణాన్ని మెరుగుపరచడం, ఉద్యోగుల హక్కులను కాపాడటంతో పాటు వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఉన్నాయి.