తెలంగాణలో ‘ధరణి’ పోర్టల్ సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న బాధితులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ‘ధరణి’ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా అదనపు కలెక్టర్, ఆర్టీవో స్థాయిలో ధరణి దరఖాస్తుల పరిష్కారించేలా గురువారం భూపరిపాలన విభాగం చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ మార్గదర్శకాలు జారీ చేశారు. ధరణి కమిటీ ఇచ్చిన సూచనల మేరకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు సర్క్యూలర్ లో పేర్కొన్నారు.