తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సన్నవడ్లకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. సన్నవడ్లపై ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని.. తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేసే వారిని ఉపేక్షించరాదని చెప్పారు. గురువారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.