అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రేషన్ సరకులకు సంబంధించి మరో తీపి కబురు అందించింది. రేషన్ కార్డు ఉన్న వారు రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా సరుకులు తీసుకోవచ్చని సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ ప్రకటించారు. త్వరలోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకొస్తున్నామని, ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు అందిస్తామన్నారు. ఇన్ఛార్జి మంత్రులు వారంలో రెండుసార్లు జిల్లాల్లో పర్యటించాలని సీఎం రేవంత్ సూచించారు.