Telangana Government: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన కవులు, కళాకారులకు హామీ ఇచ్చిన రూ. 6 వేల పెన్షన్ అందజేసే అంశంపై దృష్టి సారించినట్లు సమాచారం. ఈ సందర్భంగా కళాకారులు, మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి, పెన్షన్‌తో పాటు ఆరోగ్య బీమా సదుపాయం, ప్రత్యేక హెల్త్ కార్డులు, గుర్తింపు కార్డుల జారీని కోరారు.
మంత్రి ఈ విజ్ఞప్తికి స్పందిస్తూ, అర్హులైన వృద్ధ కళాకారులందరికీ పెన్షన్ అందించే విషయాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని తెలిపారు. ఈ చర్య కళాకారులకు ఆర్థిక, సామాజిక భద్రతను కల్పించే దిశగా ఒక ముందడుగుగా భావిస్తున్నారు.