Homeహైదరాబాద్latest News9 నెలల్లో రూ.75,995 కోట్లు అప్పు చేసిన తెలంగాణ ప్రభుత్వం..!

9 నెలల్లో రూ.75,995 కోట్లు అప్పు చేసిన తెలంగాణ ప్రభుత్వం..!

తెలంగాణ ప్రభుత్వం గత 9 నెలల్లో రూ.75,995 కోట్లు అప్పు చేసింది. ఇవాళ బాండ్ల వేలం ద్వారా ఆర్బీఐ నుంచి మరో రూ.1500 కోట్లు అప్పుల రూపంలో తీసుకోనుంది. ఈ నెల 3వ తేదీనే రూ.1,000 కోట్లు అప్పు తీసుకున్న ప్రభుత్వం నేడు మళ్లీ అప్పు చేయనుంది. ఇప్పటికే ఆగస్టులో రూ.6,000 కోట్లు, జులైలో రూ.7,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది. రేవంత్ సర్కార్ ఇప్పటి వరకు బాండ్ల రూపంలో రూ.46,118 కోట్లు, కార్పొరేషన్ల ద్వారా రూ.29,877 కోట్లు అప్పు తీసుకుంది.

Recent

- Advertisment -spot_img