2025 ఏడాదికి సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే ఏడాదిలో మొత్తం 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. జనవరి 1న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. బదులుగా ఫిబ్రవరి 10న రెండో శనివారాన్ని పనిదినంగా ఉత్తర్వుల్లో పేర్కొంది. జనవరి14న సంక్రాంతి, మార్చి30న ఉగాది, ఆగస్టు27న వినాయకచవితి, అక్టోబర్ 3న దసరా, 20న దీపావళి పండుగల నేపథ్యంలో సెలవులు ప్రకటించారు.