Homeహైదరాబాద్latest Newsఅప్పుల భారంతో తెలంగాణ ప్రభుత్వానికి కష్టాలు.. మరి ఈ సారి బడ్జెట్‌ పరిస్థితేంటి..?

అప్పుల భారంతో తెలంగాణ ప్రభుత్వానికి కష్టాలు.. మరి ఈ సారి బడ్జెట్‌ పరిస్థితేంటి..?

అప్పుల భారంతో తెలంగాణ ప్రభుత్వం సతమతమవుతోంది. 2023 డిసెంబరులో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 199 రోజుల్లో కొత్తగా రూ.25,188 కోట్ల రుణాలు సేకరించింది. ఇదే కాలవ్యవధిలో పాత బాకీలపై వడ్డీలు, అసలు సొమ్ముపద్దు కింద కిస్తీలకు కట్టింది రూ.38,040 కోట్లు. సగటున నెలకు రూ.6 వేలకోట్లకు పైగా కిస్తీల కింద చెల్లించాల్సి వస్తోంది. రోజుకు రూ.191 కోట్లు వడ్డీ కడుతున్నారు.
అయితే వచ్చే నెలలో శాసనసభలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) పూర్తిస్థాయి బడ్జెట్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బడ్జెట్‌ తయారీలో భాగంగా అన్ని శాఖల నిధుల అవసరాలపై చర్చించేందుకు ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క సమావేశాలను నిర్వహిస్తున్నారు. కొత్త బడ్జెట్‌లో అత్యధికంగా నిధుల కేటాయింపులు వ్యవసాయ, నీటి పారుదల, విద్యుత్‌ శాఖలకే ఉంటాయని తెలుస్తోంది. అయితే అప్పుల భారంతో తెలంగాణ ప్రభుత్వం సతమతవుతుంది. ఈ సమయం బడ్జెట్‌ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Recent

- Advertisment -spot_img