డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. భూమి లేని నిరుపేదల బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి రూ.12,000 జమ చేస్తామని చెప్పారు. ఖమ్మం(D) నాగులవంచలో దళితబంధు 2వ విడత లబ్దిదారులకు మంజూరి పత్రాలు అందజేసి మాట్లాడారు. త్వరలోనే పేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తామన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని స్వాగతించకపోతే రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్లేనన్నారు.