Homeహైదరాబాద్latest NewsVRAలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

VRAలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఇదేనిజం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో పెండింగులో ఉన్న వీఆర్ఏల జీతాలకు క్లియరెన్స్ లభించింది. వివిధ శాఖల్లో ఉన్న 15,560 మంది, రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరీ పోస్టుల ద్వారా పని చేస్తోన్న వారందరికీ పెండింగులోని 7 నెలల వేతనాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను CCLA ఆదేశించారు. ఈ మేరకు మెమో జారీ చేశారు. జీవో నం.81, 85ల ద్వారా వివిధ శాఖల్లో గ్రేడ్ సర్వీసెస్/రికార్డు అసిస్టెంట్స్/ జూనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్నారు. వారందరికీ రెగ్యులర్ పే స్కేల్‌ని అమలు చేయాలని నిర్ణయించారు. కొన్ని నెలలుగా వేతనాల్లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వీఆర్ఏలకు ఇది శుభదాయకం

Recent

- Advertisment -spot_img