Homeహైదరాబాద్latest Newsమహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై ప్రభుత్వం ఇచ్చే బతుకమ్మ కానుక ఇదే..!

మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై ప్రభుత్వం ఇచ్చే బతుకమ్మ కానుక ఇదే..!

మహిళలకు గత తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందించగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది బతుకమ్మకు చీరల స్థానంలో రూ.500 చొప్పున నగదు ఇవ్వాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నేరుగా మహిళల అకౌంట్లలోనే ఈ డబ్బు జమ చేయాలని ప్లాన్ చేశారట. రేషన్ కార్డు లేదా స్వయం సహాయక బృందాల్లో సభ్యత్వం ప్రామాణికంగా అర్హులను గుర్తించేందుకు ప్లాన్ చేస్తోన్నట్లు వినిపిస్తోంది. గతంలో బతుకమ్మ చీరల వ్యవహారంలో అవినీతి జరిగిందని, అలాగే చీరల్లో నాణ్యత లేదని, వాటితో ఆడపడుచులు సంతృప్తిగా లేరన్న వాదనలు రావటంతో.. రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నారట.

Recent

- Advertisment -spot_img