మూసీ నిర్వాసిత కుటుంబాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే నివాసాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయిస్తున్న ప్రభుత్వం.. విద్య, ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సెర్ఫ్ సీఈవో ఛైర్మన్గా, జీహెచ్ఎంసీ కమిషనర్ వైస్ ఛైర్మన్గా 14 మంది సభ్యులతో జీవనోపాధి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.