తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి అవగాహన కల్పించాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటి నుండి తొమ్మిది తరగతుల వరకు గణితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఒక పాఠంగా చేర్చడానికి కృషి చేస్తోంది. ఒకటి నుండి ఐదు తరగతులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిలబస్ 2-3 పేజీలు మరియు ఆరు నుండి తొమ్మిది తరగతులకు 4-5 పేజీలు ఉంటుంది. పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ SCERT సబ్జెక్ట్ నిపుణులతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిలబస్‌ను సిద్ధం చేస్తున్నారు.