Homeహైదరాబాద్latest Newsఎస్సీ వర్గీకరణపై.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఎస్సీ వర్గీకరణపై.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని ఆదేశం, ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాలని సీఎం ఆదేశించారు. వన్ మ్యాన్ కమిషన్ నివేదిక అందిన తర్వాతే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.ఇంకా అవసరమైన ఏర్పాట్లను 24 గంటల్లో పూర్తి చేయాలని కమిషన్‌ను ఆదేశించారు. తెలంగాణలో 60 రోజుల వరకు కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వరాదని, కమిషన్ నివేదిక తర్వాతే కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులు సూచించారు.

Recent

- Advertisment -spot_img