Homeహైదరాబాద్latest Newsమూడు సభలతో వేడెక్కిన Telangana : Election Campaign

మూడు సభలతో వేడెక్కిన Telangana : Election Campaign

– ఒకేరోజు మూడు పార్టీల భారీ బహిరంగసభలు
– పరేడ్​ గ్రౌండ్స్​లో కాంగ్రెస్​ సభ, కరీంనగర్​లో బీఆర్ఎస్​ కదనభేరి
– ఇంపిరియల్​ గార్గెన్స్​, ఎల్బీ స్టేడియంలో అమిత్​ షా మీటింగ్​

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఒకేరోజు మూడు పార్టీలకు సంబంధించిన బహిరంగసభలు రాష్ట్రంలో నిర్వహించబోతున్నారు. దీంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్ఎస్​ మూడు పార్టీలు ఒకేరోజు సభ నిర్వహిస్తుండటం గమనార్హం. పరేండ్ గ్రౌండ్స్​లో కాంగ్రెస్​ పార్టీ మహిళా శక్తి విధాన ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించోబోతున్నారు. ఈ సభకు దాదాపుగా లక్ష మంది మహిళలను తరలించబోతున్నట్టు తెలుస్తున్నది. ఎల్బీ స్టేడియంలో కేంద్ర మంత్రి అమిత్​ షా విజయసంకల్ప సమ్మేళనం నిర్వహించనున్నారు. సోషల్ మీడియా వారియర్స్​తో ఆయన భేటీ కాబోతున్నారు. ఇక బీఆర్ఎస్​ ఆధ్వర్యంలో కరీంనగర్​లో కదనభేరి పేరిట భారీ బహిరంగసభ ఉండబోతున్నది. ఈ సభకు భారీగా జనాలను తరలిస్తున్నారు. 12 వ తేదీన కరీంనగర్​ లో సభ నిర్వహించాలని తొలుత బీఆర్ఎస్​ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఆ తర్వాత క్రమంగా కాంగ్రెస్, బీజేపీ లు కూడా అదే రోజు సభలను నిర్వహించాయి. మొత్తంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడు సభల ఏర్పాట్ల మీదే చర్చ జరుగుతోంది.

Recent

- Advertisment -spot_img