Homeహైదరాబాద్latest NewsTelangana : రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు భారీ షాక్‌..!!

Telangana : రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు భారీ షాక్‌..!!

Telangana : తెలంగాణ (Telangana) విద్యుత్ వినియోగదారులకు షాక్ తగిలింది. రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు సవరించనున్నారు. గృహ ఈ క్రమంలో విద్యుత్ యూజర్స్ కి రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వనుంది. పర్మిట్లు ఉన్న ఇళ్లన్నింటినీ డొమెస్టిక్ కేటగిరీలో కొనసాగించాలని, పర్మిట్లు లేని ఇళ్లను తాత్కాలిక కేటగిరీలో చేర్చి నిబంధనల పేరుతో బిల్లులను పెద్దమొత్తంలో వసూలు చేయాలని TGSPDCL నిర్ణయించింది. ఇది అమల్లోకి వస్తే గ్రేటర్ హైదరాబాద్‌లోని సుమారు 10 లక్షల మంది విద్యుత్ వినియోగదారులపై భారీ భారం పడటం ఖాయం. బహుళ అంతస్తుల భవనాల్లో నివసించే వారిపై భారీగా ప్రభావం పడ్డనుంది. ఇకపై ఆ అంతస్తుల్లోని విద్యుత్ కనెక్షన్లు డొమెస్టిక్ కేటగిరీలోనే కొనసాగనున్నాయి, డిస్కం నిర్ణయించిన శ్లాబ్ ప్రకారం బిల్లులు చెలాయించనున్నారు. ఈ క్రమంలో ఆయా ఇండ్లలోని 80% మంది వినియోగదారులకు 300 యూనిట్లలోపు స్లాబ్‌ వల్ల 1000 నుంచి రూ.2 వేలలోపు బిల్లు రానుంది. దీనితో, వారు సాధారణ బిల్లు కంటే రెండు నుండి మూడు రెట్లు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

Recent

- Advertisment -spot_img