Telangana Inter Results: విద్యార్థులు తమ ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) 2025 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం ఫలితాలను ఏప్రిల్ నెల చివరి వారంలో ముఖ్యంగా ఏప్రిల్ 24 నుంచి 27 మధ్య విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఫలితాలను ఆన్‌లైన్‌లో TSBIE అధికారిక వెబ్‌సైట్‌లైన tsbie.cgg.gov.in, results.cgg.gov.in, మరియు examresults.ts.nic.in ద్వారా విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఉపయోగించి తనిఖీ చేసుకోవచ్చు. అలాగే ఫలితాలను SMS ద్వారా కూడా ఫలితాలు చెక్ చేసే సౌలభ్యం ఉంది.
ఇంటర్ పరీక్షల వివరాలు:
- ఫస్ట్ ఇయర్ : మార్చి 5 నుంచి మార్చి 24, 2025 వరకు.
- సెకండ్ ఇయర్: మార్చి 6 నుంచి మార్చి 25, 2025 వరకు.
- పరీక్షకు హాజరైన విద్యార్థులు: మొత్తం 9,96,971 మంది.
ఇంటర్ ఫలితాలు చెక్ చేయండిలా:
- ఈ అధికారిక వెబ్‌సైట్లు: tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in.
- విద్యార్థులు వారి హాల్ టికెట్ నంబర్ తో ఫలితాలను తెలుసుకోవచ్చు.