తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విద్యాశాఖ అధికారులు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది 9.80 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4.78 లక్షల మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4 లక్షల మందికి పైగా ఉన్నారు. ఫలితాల కోసం tsbie.cgg.gov.in, results.cgg.gov.in వెబ్‌సైట్లలో సంప్రదించాలని ఇంటర్ బోర్డు సూచించింది.