Homeహైదరాబాద్latest Newsరేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు

రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు

ఇంటర్ ఫలితాల విడుదలపై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి ప్రకటించారు. ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తామని బోర్డు అధికారులు తెలిపారు. ఈ ఏడాది 9.80 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4.78 లక్షల మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4 లక్షల మందికి పైగా ఉన్నారు. ఫలితాల కోసం tsbie.cgg.gov.in, results.cgg.gov.in వెబ్‌సైట్లలో సంప్రదించాలని ఇంటర్ బోర్డు సూచించింది.

Recent

- Advertisment -spot_img