హైదరాబాద్ః తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2020-21 అకాడమిక్ ఇయర్‌కు సంబంధించి ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 16 నుంచి రాష్ట్రంలోని అన్ని ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఇంటర్ బోర్డు సెక్రెటరీ సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. సెప్టెంబర్ 18 నుంచి ఆన్‌లైన్ క్లాసెస్ ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 30తో ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ ముగియనుంది. రాష్ట్రంలోని గవర్నమెంట్, ప్రైవేట్, రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ రెసిడెన్షియల్, కేజీబీవీ, టీఎస్ మోడల్ కాలేజెస్‌తోపాటు ఇంటర్ బోర్డు అనుమతి పొందిన అన్ని కాలేజీలకు ఈ షెడ్యూల్ వర్తిస్తుందని బోర్డు సెక్రెటరీ తెలిపారు.