Homeహైదరాబాద్latest Newsఅప్పుల కుప్పగా తెలంగాణ.. ఒక్కొక్కరి నెత్తిపై 1.76 లక్షలు అప్పు..?

అప్పుల కుప్పగా తెలంగాణ.. ఒక్కొక్కరి నెత్తిపై 1.76 లక్షలు అప్పు..?

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని, అప్పుల ఊబిలో ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కొక్కరిపై రూ.1,76,360 అప్పు ఉందని సమాచారం. 2014-15లో ఒక్కొక్కరిపై రూ.20,251 ఉండగా ఆ సంఖ్య పదేళ్లలో ఐదు రెట్లు పెరిగిపోయింది. రాష్ట్ర మొత్తం అప్పు రూ.72,658 కోట్ల నుంచి ఏకంగా 824.5 శాతం పెరిగి రూ.6,71,757 కోట్లకు చేరిందని తెలుస్తుంది. దీని ఫలితంగా రాష్ట్ర ప్రజల పై తలసరి అప్పు 8.7 శాతానికి పైగా పెరిగిపోయింది. ప్రణాళిక శాఖ తయారు చేసిన 2024 సామాజిక ఆర్థిక ముఖచిత్రం నివేదిక ఈ విషయాలు వెల్లడించింది. 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,24,104 ఉండగా, 2023-24 నాటికి అది రూ.3,47,299లకు పెరిగింది.

Recent

- Advertisment -spot_img