Homeతెలంగాణషూటింగ్​లకు తెలంగాణలో అనేక ప్రదేశాలు

షూటింగ్​లకు తెలంగాణలో అనేక ప్రదేశాలు

రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీవీ సీరియల్ ప్రొడక్షన్ మేనేజర్ ల అసోసియేషన్ నాయకులతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో తెలంగాణ టూరిజం కు చెందిన ప్రాంతాల్లో సీరియల్స్ షూటింగ్ చేసుకోవటానికి అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం నుండి అందిస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు.

తెలంగాణ రాష్ట్రం లో అద్భుతమైన ప్రదేశాలు, సుందర ప్రాంతాలు, షూటింగ్ కు అవసరమైన లోకేషన్స్ , సౌకర్యాలు ఉన్నాయన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పరిసర, కృష్ణా, గోదావరి నదుల పరివాహక ప్రాంతాలతో పాటు లక్నవరం, వరంగల్ ఫోర్ట్, చారిత్రిక ప్రదేశాలు, కోటలు, దేశంలో అతిపెద్ద ఎకో టూరిజం పార్క్ అయిన కేసీఆర్ పార్క్, పిల్లల మర్రి, మన్యం కొండ లతో పాటు సోమశిల, మల్లెల తీర్థం, అక్కమహా దేవి గుహలు, నల్లమల అటవీ లో ఉన్న టూరిజం ప్రాంతాల్లో సీరియల్ ల షూటింగ్ కు ఎన్నో అనువైన లోకేషన్స్ ఉన్నాయని మంత్రి సీరియల్ ప్రొడక్షన్స్ మేనేజర్లు కు వివరించారు.

మన రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉండగా సినిమాల, సీరియల్ ల షూటింగ్ ల కోసం వివిధ దేశాలు, రాష్ట్రాలకు వెళ్లి షూటింగ్ చేస్తున్నారన్నారు. మన ప్రాంతంలోని టూరిజం ప్రాంతాలకు గుర్తింపు కోసం కృషి చేస్తున్నామన్నారు. విదేశాలకు మించి మన ప్రాంతంలో మంచి లొకేషన్స్ ఉన్నాయన్నారు. హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో అనేక షూటింగ్ కు అనుకూలమైన లోకేషన్స్ ఉన్నాయన్నారు. వీటితో పాటు HMDA పరిధిలో ఎన్నో అందమైన దృశ్యాలు ఉన్నాయన్నారు. మంత్రి కేటీఆర్​ సూచనల మేరకు సినిమా, టీవీ పరిశ్రమ లకు తగిన ప్రోత్సాహకాలు అందించేందుకు సీఎం కేసీఆర్​ అనుమతితో పలు రాయితీలను అందిస్తామన్నారు.

టూరిజం శాఖ తరుపున షూటింగ్ చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు కు సహకారాన్ని అందిస్తామన్నారు.

ఈ అవకాశాలను సీరియల్స్ మేనేజర్ లు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు.

ఈ కార్యక్రమంలో టీవీ సీరియల్స్ ప్రొడక్షన్స్ మేనేజర్లు అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img