పదేళ్లు తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేవని, ఇప్పుడు రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకుందని BRS చీఫ్ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెల్లం ఉన్న దగ్గర ఈగలు వస్తాయని, అలానే సిరిసంపదలు ఉన్న తెలంగాణాని దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. తెలంగాణకి ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేసిందని మండిపడ్డారు. బలవంతంగా మనల్ని ఆంధ్రాలో కలిపారని విమర్శించారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.