లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన ముంబై ఇండియన్స్ కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై ఆటగాళ్లకు జరిమానా విధించారు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రూ.24 లక్షల జరిమానా పడింది. ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా ముంబై ఇండియన్స్ తుది జట్టు సభ్యులకు కూడా జరిమానా విధించింది. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతంలో ఏదీ తక్కువగా ఉంటే దాన్ని జరిమానాగా విధించామని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.