Homeహైదరాబాద్latest News'ఆర్ఆర్ ట్యాక్స్'తో తెలంగాణ లూటి.. దేశ వ్యాప్తంగా దీనిగురించే చర్చ: ప్రధాని మోడీ

‘ఆర్ఆర్ ట్యాక్స్’తో తెలంగాణ లూటి.. దేశ వ్యాప్తంగా దీనిగురించే చర్చ: ప్రధాని మోడీ

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ఆర్ఆర్ ట్యాక్స్ తెలంగాణలో లూటి జరుగుతోంకారంలోకి వచ్చాక ఆ అవినీతిపై దర్యాప్తు చేయట్లేదు. దని.. దేశ వ్యాప్తంగా దీనిగురించే చర్చ నడుస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు వచ్చిన ప్రధాని మోడీ.. బుధవారం ఉదయం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవా డలోని శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. కరీంనగర్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం ముందే నిర్ణయమైందన్నారు. ఇక్కడ ఎవరికీ తెలియని అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపిందన్నారు. ‘దక్షిణ కాశీ భగవానుడు శ్రీ రాజరాజేశ్వరస్వామికి ప్రణామాలు.

తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసమే వచ్చాను. మీ ఓటు వల్లే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. కాంగ్రెస్ పాలనలో అన్నిరంగాలు దెబ్బతిన్నాయి. పదేళ్ల ఎన్డీయే పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూ సుకెళ్తంది. వ్యవసాయాన్ని ఆధునికీకరించి లాభసా టిగా మార్చాం. ఆ రంగంలో డ్రోన్లను ప్రోత్సహించాం. టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేశాం. రైతులకు పెట్టు బడి సాయం అందించి ఆదుకుంటున్నాం. అవినీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ఏ ఫెవికాల్ బంధం. ప్రజలముందు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటారు. తెరవెనుక మాత్రం అవినీతి సిండికేట్ గా మారుతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు దేశవ్యాప్తంగా ఆర్ఆర్ ట్యాక్స్పైనే చర్చ జరుగుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కంటే ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లు మించిపోయాయి. తెలు గాణలోని ఆర్ లూటీ చేసి.. ఢిల్లీలోని ఆర్ కు ఇస్తున్నారు. వారి ఆటను ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాం గ్రెస్కు బుద్ధి చెబుతారు’ అని మోడీ అన్నారు.

దేశానికే మొదటి ప్రాధాన్యత..
ఇప్పటి వరకు మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమికి ఓటమేనని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మిగిలిన నాలుగు విడతల్లోనూ బీజేపీ, ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సన్నద్ధ మయ్యారని చెప్పారు. కరీంనగర్ కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభావం కనిపించట్లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్కు కుటుంబమే తొలి ప్రాధాన్యత.. బీజేపీ మాత్రం దేశానికే తొలి ప్రాధాన్యం ఇస్తుంది. ‘కుటుంబం వల్ల.. కుటుంబం చేత.. కుటుంబం కోసం..” ఈ నినాదంతో ఆ రెండు పార్టీలు పనిచేస్తున్నాయి. బీఆ ర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటే.. నాణేనికి బొమ్మాబొరు సులాంటివి. అవి అవినీతి పార్టీలు. తెలంగాణ ప్రజల స్వప్నాన్ని కాలరాశాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ప్రజల కలలు సాకారమవుతాయని అందరూ భావించారు. కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి కుటుంబలబ్ది కోసమే బీఆర్ఎస్ పనిచేసింది ‘ అని మోడీ విమర్శించారు.

Recent

- Advertisment -spot_img