TELANGANA POLICE: ఇదేనిజం, హైదరాబాద్: ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు (TELANGANA POLICE) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శౌర్య పతకాలను ప్రకటించింది. అత్యుత్తమ పతకాల్లో ఒకటైన శౌర్య పతకాలకు ఈ ఏడాది మొత్తం తొమ్మిది మందిని ఎంపిక చేశారు. ములుగు (MULUGU) జిల్లా వెంకటాపురం ఎస్ఐ కొప్పుల తిరుపతిరావు, ఖమ్మం సిటీ స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ పీ సత్యనారాయణరెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం సీఐ చెన్నూరి శ్రీనివాస్, అదే విధంగా స్టేట్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన వాసాల తిరుపతి(సీఐ), కే శ్రీనివాస్(ఎస్ఐ), జే వేణుగోపాల్(హెచ్ సీ), కే సుధీర్ రెడ్డి(పీసీ), బీ అజయ్ శ్యామ్ (పీసీ) తదితరులకు శౌర్య పతకాలు దక్కాయి. వీటితోపాటు 12 మంది పోలీస్ అధికారులకు మహోన్నత సేవా పతకాలు, 97 మందికి ఉత్తమ సేవా పతకాలు, 58 మందికి కఠిన సేవా పతకాలు, 485 మందికి సేవా పతకాలు అందజేశారు.