Homeహైదరాబాద్latest Newsవాస్తు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు.. అప్పుడు కేసీఆర్ కి వాస్తు పిచ్చి అన్నారు.. మరి...

వాస్తు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు.. అప్పుడు కేసీఆర్ కి వాస్తు పిచ్చి అన్నారు.. మరి ఇప్పుడు రేవంత్ చేస్తుందేంటి..?

తెలంగాణలో రాజకీయాలు ఇప్పుడు వాస్తు చుట్టూ తిరుగుతున్నాయి. హైదరాబాద్‌లో గత ప్రభుత్వం నిర్మించిన కొత్త సచివాలయంలో వాస్తు సరిగా లేదని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలోని ఈశాన్య ద్వారం నుంచి సీఎం, మంత్రులు వచ్చేలా మార్పులు చేస్తున్నారు. ఇక ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారులు ఆగ్నేయ ద్వారం నుంచి వచ్చేలా ప్రత్యేక వాస్తు మార్పులు చేస్తున్నారని తెలుస్తుంది. గతంలో అదేవిధంగా ఇప్పుడు ఆరు అంతస్తులు ఉన్నాయి. అయితే పక్కనే ఉన్న సీఎం ఛాంబర్ రూమ్ ను అందులో సీఎం కూర్చునే కుర్చీ దిశను మారుస్తున్నట్లు తెలుస్తోంది.
గత ముఖ్యమంత్రి కేసీఆర్ అదృష్ట సంఖ్య 6 అని తెలుస్తోంది.అందుకే ఆయన ఛాంబర్‌తో పాటు సీఎంఓ సచివాలయం 6వ అంతస్తులో ఉంది. ప్రస్తుతం సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి అదృష్ట సంఖ్య 9 కావడంతో ఆయన ఛాంబర్ 9వ అంతస్తుకు మార్చుకుంటే బాగుంటుందని భావిస్తున్నారని తెలుస్తుంది. అయితే సీఎం కూర్చునేందుకు విశాలమైన స్థలం తొమ్మిదో అంతస్తులో లేకపోవడంతో 6వ అంతస్తులోనే వాస్తు మార్పులు చేసి కూర్చోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం కొత్త సచివాలయాన్ని నిర్మిస్తుంటే కేసీఆర్ వాస్తు పిచ్చి పట్టిందని ఆయన కుమారుడి కోసమే ఈ సెక్రటేరియట్ కట్టిస్తున్నారని కామెంట్స్ రేవంత్ రెడ్డి చేశారు. అప్పుడు సచివాలయం నిర్మిస్తుంటే పదే పదే ఆరోపణలు, విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అలాగే సచివాలయంలోకి ప్రవేశానికి బాహుబలి గేట్లను తొలగించే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి ప్రభుత్వ పాలకులు ఇలాంటి వాస్తు మార్పులను తమకు అనుకూలమైన రీతిలో మార్చుకుంటే.. బీఆర్ఎస్ నేతలు గతంలో తమను తప్పు పట్టినట్లుగానే ఇప్పుడు మీకు ఇదేం వాస్తు పిచ్చి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img