Homeతెలంగాణతెలంగాణ ప్రొటెం Speaker ​గా అక్బరుద్దీన్ ఒవైసీ

తెలంగాణ ప్రొటెం Speaker ​గా అక్బరుద్దీన్ ఒవైసీ

– ప్రభుత్వ విజ్ఞప్తిని అంగీకరించిన అక్బరుద్దీన్
– రేపటి నుంచి 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు

ఇదే నిజం, హైదరాబాద్: తెలంగాణ ప్రొటెం స్పీకర్​గా అక్బరుద్దీన్ ఒవైసీ వ్యవహరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని అక్బరుద్దీన్ అంగీకరించారు. రేపటి నుంచి 4 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో అక్బరుద్దీన్​ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. చాంద్రాయణగుట్ట సెగ్మెంట్ నుంచి 1999 నుంచి 2023 వరకు వరుసగా ఆరుసార్లు అక్బరుద్దీన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.కొత్త స్పీకర్ ఎన్నికయ్యేంత వరకూ అక్బరుద్దీన్‌ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు.ఇప్పటిదాకా ప్రొటెం స్పీకర్ ఎవరన్నదానిపై చర్చ జరిగింది. సీనియారిటీ ప్రకారం మాజీ సీఎం కేసీఆర్ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాల్సి ఉంది. ఆయన 8 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే, కేసీఆర్​ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 8 వారాల పాటు ఆయనకు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. ఇక తర్వాత వరుసలో బీఆర్ఎస్ నుంచి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఉన్నారు. ఇక కాంగ్రెస్‌లో ఆరుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. కానీ వీరిద్దరూ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో రేవంత్ సర్కార్ అక్బరుద్దీన్ ఒవైసీ వైపు మొగ్గు చూపింది.

Recent

- Advertisment -spot_img