Homeతెలంగాణరాష్ట్రంలో రిజిస్ట్రేష‌న్లు బంద్

రాష్ట్రంలో రిజిస్ట్రేష‌న్లు బంద్

శాఖ మొత్తానికి సెల‌వులు ఇచ్చిన ప్ర‌భుత్వం
హైద‌రాబాద్ః రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తున్న నేప‌థ్యంలో రిజిస్ట్రేషన్లను ర‌ద్దు చేస్తూ ప్ర‌భుత్వం ఆర్డ‌ర్స్ పాస్ చేసింది. మంగ‌ళ‌వారం నుంచి రిజిస్ర్టేష‌న్ల శాఖ‌కు సెల‌వులు ప్ర‌క‌టించింది. త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చేవ‌ర‌కూ రిజిస్ట్రేషన్ల శాఖకు సెల‌వులు అమల్లో ఉంటాయని సోమ‌వారం జారీ చేసిన‌ ఉత్వ‌ర్వుల్లో ప్ర‌భుత్వం వెల్లడించింది. ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల ప్ర‌కారం మంగ‌ళ‌వారం నుంచి పూర్తిగా అన్నిరకాల రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయ‌ని రిజిస్ట్రేష‌‌న్లు, స్టాంపుల శాఖ క‌మిష‌న‌ర్ చిరంజీవులు స్ప‌ష్టం చేశారు. కొత్త రెవెన్యూ చ‌ట్టంలో భాగంగా వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు వెంట‌నే స్వాధీనం చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌భుత్వ ఆదేశాలు వెళ్లిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img