హైదరాబాద్ నగర ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్ పలికింది. ఎలక్ట్రిక్‌గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్‌పాస్ ధరలను తగ్గించింది. ఈ బస్‌పాస్‌తో మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును ఆర్టీసీ కల్పించింది. ఎలక్ర్టిక్‌గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్ పాస్ ధర రూ. 2530 నుంచి రూ. 1900లకు తగ్గిందని తెలంగాణ ఆర్టీసీ సంస్థ వెల్లడించింది.