తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఫ్రీ కావడంతో ఎక్స్ప్రెస్, ఆర్డీనరి బస్సుల్లో ఎక్కువగా ప్రయాణించడం.. డీలక్స్ బస్సుల్లో ప్రయాణం చేసే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోతుంది. కాగా ఈ క్రమంలో ఆర్టీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ప్రయాణికులను డీలక్స్ బస్సుల వైపు మళ్లించేందుకు ఆర్టీసీ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే డీలక్స్ బస్సుల్లో మహిళలు ప్రయాణించినట్లైతే మహిళలకు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తామంటూ ఆర్టీసీ మరో స్కీం స్టార్ట్ చేసింది. ముందుగా హనుమకొండ-హైదరాబాదు మార్గంలో జనగామ డిపో 3 బస్సులను ప్రవేశపెట్టింది. ఈ బస్సుల్లో ప్రయాణిస్తే ప్రతి 15 రోజులకు ముగ్గురు మహిళలకు బస్సు అందజేస్తామని ఆర్టీసీ అనౌన్స్ చేసింది. ముందు ముందు ఈ ఫ్రీ బస్సు పథకాన్ని కూడా తొలగించే అవకాశాలున్నాయంటూ జనాలు అభిప్రాయపడుతున్నారు.