తెలంగాణలో ఈ ఏడాది నుంచే ‘పంట బీమా’ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. గత BRS పాలనలో వ్యవస్థలన్నీ కుంటుపడ్డాయని విమర్శించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ధాన్యాన్ని పండించే జిల్లా నల్గొండ అని తెలిపారు. అటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.