హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. HMDA పరిధిలోని చెరువులను సమగ్ర సర్వే చేయాలని అధికారులను ఆదేశించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. చెరువుల FTL, బఫర్ జోన్లను గుర్తించాలని సూచించింది. మూడు నెలల్లో సర్వే పూర్తి చేయాలని చెప్పింది. కాగా, అప్పటి వరకు హైడ్రా కూల్చివేతలను నిలిపి వేయనున్నట్లు తెలుస్తోంది.