హైదరాబాద్ః తెలంగాణ తాత్కాలిక సెక్రెటరియట్ నడుస్తున్న బీఆర్కే భవన్‌లో కరోనా కలకలం సృష్టించింది. తాజాగా చేపట్టిన టెస్టుల్లో 17 మంది సెక్రెటరియట్ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. పాజిటివ్ తేలిన వారిని ఐసోలేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన ఉద్యోగులతో కాంటాక్ట్ అయిన ఇతర ఉద్యోగులకు సైతం టెస్టులు నిర్వహించినట్లు వైద్యాధికారులు తెలిపారు. వీరి రిజల్ట్ ఇంకా రావాల్సి ఉందన్నారు.