Telangana Speaker : తెలంగాణ స్పీకర్ (Telangana Speaker) గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ తరపు న్యాయవాదులు స్పీకర్ కార్యాలయానికి నోటీసులు అందజేశారు.ఈ నెల 25న సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు కేసు విచారణ జరుగనుంది. గత విచారణ సందర్భంగా ప్రభుత్వం, అసెంబ్లీ సెక్రటరీ, 10 మంది ఎమ్మెల్యేలు, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ పిటిషన్ పై ఈ నెల 22లోగా న్యాయస్థానం స్పందించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో మరో సారి నోటీసులు జారీ చేసింది.