తెలంగాణ సంస్కృతిని రూపుమాపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. దీనికి ఉదాహరణ.. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహమే. తెలంగాణ తల్లి విగ్రహ రూపం మొత్తాన్ని మార్చేశారు. తెలంగాణ సంస్కృతికి ఎంతో నిదర్శనమైన బతుకమ్మను లేకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ రూపొందించింది. దీనిపై తెలంగాణ ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బతుకమ్మ లేకుండా విగ్రహం తయారీ ఉద్దేశ్యమేంటి..? దైవత్వం ఉట్టిపడే తెలంగాణ తల్లి విగ్రహానికి చేయి గుర్తు తల్లి విగ్రహం ప్రత్యామ్నాయమా..? రేవంత్‌కు సోయిలేకపోతే మంత్రులకు, నేతల కన్నా సోయి లేదా..? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ తల్లి కాదు.. చేతి గుర్తు ప్రచారకర్తలా ఉందని మేధావులు, రచయితలు మండిపడుతున్నారు. వెంటనే విగ్రహ రూపం మార్చాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.