Industrial Development : పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ మొదటి స్థానం
Industrial Development : పారిశ్రామికాభివృద్ధి విషయంలో తెలంగాణ రాష్ట్రం మంచి పనితీరు చూపిస్తోంది.
2020-21 సంవత్సరానికి వృద్ధి రేటు 8.78 శాతంగా నమోదైంది.
దీంతో దేశంలోనే పారిశ్రామిక అభివృద్ధి విషయంలో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది.
స్టార్టప్ లు, కంపెనీలు, వ్యాపార నిర్వహణకు ఉన్న అనుకూల పరిస్థితులు (ఈజ్ ఆఫ్ డూయింగ్) ఇలా ఎన్నో అంశాల ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయించారు.
Telangana Government : యూట్యూబ్ చానళ్ల పట్ల ఇకపై కఠిన వైఖరి
KTR On Bandi Sanjay : బండి సంజయ్ దీక్షపై మంత్రి కేటీఆర్ విమర్శలు
కేంద్ర ప్రభుత్వ ప్రజా ఫిర్యాదులు, పరిపాలన సంస్కరణల విభాగం ఈ మేరకు గణాంకాలను రూపొందించగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విడుదల చేశారు.
పారిశ్రామికాభివృద్ధిలో తెలంగాణకు 0.699 స్కోరు లభించింది. గుజరాత్ రాష్ట్రం 0.662 స్కోరుతో రెండో స్థానంలో ఉంది.
0.627 స్కోరుతో పారిశ్రామికాభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరో స్థానంలో నిలిచింది.
ఇక దేశంలో సుపరిపాలన పరంగా గుజరాత్ మొదటి స్థానంలో ఉంటే, మహారాష్ట్ర రెండో స్థానం సొంతం చేసుకుంది.
ఈ విషయంలో తెలంగాణ 9వ స్థానం, ఏపీ 10వ స్థానంలో నిలిచాయి.
సాంఘిక సంక్షేమం, అభివృద్ధిలోనూ తెలంగాణకు మొదటి స్థానం లభించింది.
0.699 స్కోరు దక్కింది. ఏపీ 0.546 స్కోరుతో ఆరో స్థానంలో ఉంది.