డిసెంబరు 9న రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ చేయనుంది. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహం కాదని… కాంగ్రెస్ తల్లి విగ్రహమని బీఆర్ ఎస్ నేత జగదీశ్ రెడ్డి విమర్శించారు. సచివాలయంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని… కావాలంటే ఆ విగ్రహాన్ని మీ పార్టీ కార్యాలయంలో పెట్టుకోండి అని మండిపడ్డారు. తెలంగాణవాదులు, సాంస్కృతిక వేత్తలు, శిల్పులు, అన్ని వర్గాల ప్రజల ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించినట్లు జగదీశ్ రెడ్డి తెలిపారు. ఆ తల్లి ఉన్నతంగా ఉండాలని, తలపై కిరీటం ఉండాలని కోరుకుంటున్నామని వివరించారు. కానీ ఇవాళ మీరు పెట్టుకుంటున్నది మీ కాంగ్రెస్ తల్లి విగ్రహం మాత్రమే. కాబట్టి ఆ విగ్రహాన్ని మీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోనే పెట్టుకోండి. అంతేతప్ప, ప్రజల ఆస్తి అయిన సెక్రటేరియట్ లో ఆ విగ్రహం పెట్టడానికి వీల్లేదు అని జగదీశ్ రెడ్డి అన్నారు.