తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8 హోరాహోరీగా సాగుతోంది. ఎనిమిదో వారం ఎలిమినేషన్ లో భాగంగా మెహబూబ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. కానీ హౌస్ నుండి ఈ వారం ఎలిమినేషన్‌లో ఒక మంచి కాంటెస్ట్ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యడు. హౌస్ లో తను ఆడే ఆటల్లో బెస్ట్ ఇస్తూ..తన కామెడీతో అందరిని అలరిస్తూ.. ప్రేక్షకులను మెప్పించడంలోనూ కమెడియన్ అవినాష్ సత్తా చాటాడు. అయితే అవినాష్ ఒక్కసారిగా ఎలిమినేట్ కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కుటుంబ సభ్యుల కన్నీళ్ల మధ్య అవినాష్ బయటకు వచ్చాడు. తాజాగా ఈ ఎపిసోడ్ సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు బిగ్‌బాస్ బృందం.
అయితే 8వ వారం ఎలిమినేషన్ లో భాగంగా మెహబూబ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆ ఎలిమినేషన్ నుంచి కుటుంబ సభ్యులు తేరుకోకముందే అవినాష్ ఎలిమినేట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ప్రోమోలో.. అవినాష్ గత రెండు మూడు రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నరు. ఈ నేపథ్యంలో ఇంట్లోని ఓ గదిలోకి పంపి వైద్యులు చికిత్స చేసారు. ఈరోజు రిపోర్టులు రావడంతో.. అవినాష్ ను మళ్లీ పరీక్షించిన వైద్యులు రిపోర్ట్స్ చూపించి, మీరు హౌస్ లో ఉండకపోవడమే మంచిది అని తెలిపారు. దింతో అవినాష్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. అవినాష్ నిజంగా హౌస్ నుండి వెళ్లిపోతున్నాడని కాంటెస్ట్స్ ఒక్కసారిగా ఏడవడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ప్రోమో అందరినీ కంటతడి పెట్టిస్తోంది.