Homeహైదరాబాద్latest Newsరేవ్ పార్టీలో పట్టుబడ్డ తెలుగు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు

రేవ్ పార్టీలో పట్టుబడ్డ తెలుగు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు

బెంగళూరులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ ప్రస్తుతం హాట్‌టాపిగ్‌గా మారింది. బెంగళూరు, ఏపీ, తెలంగాణ నుంచి తెలుగు సినీ నటులు, రాజకీయ నాయకులు దాదాపు 100 మంది ఇందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రానికి సిటీ సమీపంలో లోని ఓ ఫామ్‌హౌస్‌లో బెంగళూరు పోలీసులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో డ్రగ్స్ కూడా దొరికింది. 17 ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ పార్టీలో 25 మందికి పైగా యువతులు ఉన్నట్లు చెబుతున్నారు.

తెలంగాణకు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని హోస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. పుట్టిన రోజుకు ఇంత పెద్దమొత్తంలో పార్టీ అరేంజ్ చేయడంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లగ్జరీ కార్లలో అక్కడికి కొంతమంది వీఐపీలు వచ్చారు. కన్నడ నటి హేమ, ఏపీ MLA కాకాణి గోవర్థన్ రెడ్డి వంటి ప్రముఖుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img