తెలుగు దర్శకులు ప్రపంచ వ్యాప్తంగా కమర్షియల్ సక్సెస్ సాధిస్తున్నారు. సినిమా అనేది ఒక కళ మాత్రమే కాదు పెద్ద వ్యాపారం కూడా అని అందరికీ అర్థం కావడం మొదలైంది. చాలా తక్కువ మంది కథ మరియు సృష్టిలోని సవాళ్లను స్వీకరించి, గొప్ప మరియు అర్థవంతమైన చిత్రంగా మార్చారు. ఈ రోజు నాటికి, భారతదేశంలో దర్శకుడు ఎస్. ఎస్.రాజమౌళి నే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారు.’బాహుబలి’ సినిమాతో భారతదేశం అంత అతని వైపు తిరిగి చూసాలా చేసాడు.ఆ తరువాత వచ్చిన ‘RRR’ సినిమాతో మరో భారీ విజయం అందుకున్నాడు. ‘బాహుబలి’ 1, 2 మరియు RRR ఈ మూడు సినిమాలు రెవిన్యూ దాదాపు రూ. 3,500 కోట్లు జరిగింది. తెలుగు చిత్రసీమలోనే కాకుండా భారతదేశంలోనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి తెచ్చుకున్నడు.
రాజమౌళి తర్వాత, ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ‘యానిమల్’ సినిమాతో బాలీవుడ్ లో తెలుగు వాడి సత్తా చూపించాడు. సందీప్ రెడ్డి స్క్రీన్‌ప్లే తో జనాలని కట్టిపడేసాడు. రణబీర్ కపూర్ నటించిన ఈ సినిమా రూ. ఇది 800 కోట్ల వరకు వసూలు చేసింది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ నటిస్తున్నాడు.
ఈ ఇద్దరు తెలుగు దర్శకుల తర్వాత ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్ ఈ గ్రాండ్ లిస్ట్‌లో చేరాడు. ‘పుష్ప’ అతని విజయం అతనికి పెద్ద పేరు తెచ్చిపెట్టినప్పటికీ, ఈ రోజు విడుదలైన పుష్ప 2 సుకుమార్‌ను భారతదేశంలోని ప్రముఖ దర్శకుల జాబితాలో చేరిపోయాడు. ఇప్పటివరకు, పుష్ప-2 మాత్రమే భారతీయ సినిమాలలో మొదటి రోజు ఉత్తమ ఆదరణ పొందింది. ఈ చిత్రం అభిమానుల నుండి మంచి అంచనాలను అందుకుంటుంది మరియు రూ. 1000 కోట్లు వసూలు చేస్తుందని తెలుస్తోంది. వీరితో పాటు తెలుగు దర్శకుడు నాగ్ అశ్విన్ ‘కల్కి’ సినిమాతో రూ. 1,000 కోట్లు వసూలు చేసాడు.భారతీయ సినిమాలో ఒకే భాష నుంచి నలుగురు దర్శకులు వెయ్యి కోట్ల బిజినెస్‌కి చేరుకోవడం ఇదే తొలిసారి. తెలుగు సినిమా దర్శకులు చాలా మందిని ఆశ్చర్యపరిచే గొప్పతనంతో అద్భుతమైన వ్యాపారాన్ని సాధించారు.