Idenijam, webdesk : చదువుకున్నారు. తెలివి ఉంది. ఇంటర్నెట్ వాడటం తెలుసు. ఫోన్ యూసేజ్‌పై విపరీతమైన ఐడియా ఉంది. ఫోన్‌లో ఎన్నో లావావాదేవీలు చేస్తుంటారు. సైబర్ మోసాలపైనా అవగాహన ఉంది. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలుసు. అయినా నిత్యం ఏదో చోట సైబర్ మోసాలకు గురవుతూనే ఉన్నారు. బాధితులు నిరక్షరాస్యులు అయితే ఓకే అనుకోవచ్చు కానీ..గ్రాడ్యుయేట్స్, ఆఫీసర్స్, పొలిటీషియన్స్..ఇలా సమాజం గురించి అవగాహన ఉన్న ఎందరో ప్రముఖులు మోసగాళ్ల తెలివికి చిక్కారు. బలయ్యారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ క్రైమ్స్ ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి సేమ్ ఫార్ములా ద్వారా రూ.34 లక్షలు పోగొట్టుకొని..అయ్యో పాపం అనే స్టేజ్‌కి వెళ్లాడు.
వివరాల్లోకి వెళితే..నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి (52)కి స్టాక్ ట్రేడింగ్ సలహాలిస్తామంటూ ఇటీవల వాట్సాప్‌లో ఓ మెసేజ్ వచ్చింది. అధిక మొత్తంలో రిటర్న్స్ వస్తాయని ఆశ చూపారు. టెంప్ట్ అయ్యాడు. నంబర్‌కు కాల్ చేశాడు. వాళ్లు 200 మంది ఉన్న ఓ గ్రూప్‌లో యాడ్ చేశారు. ప్రత్యేక యాప్‌ల ద్వారా క్రయవిక్రయాలు జరపాలన్నారు. ఈ వ్యక్తి అలాగే చేశాడు. పుల్‌అప్ షేర్లు కొనుగోలు చేయించారు. కొంత లాభం వచ్చినట్లు నమ్మించారు. బాధితుడి అనుమతి లేకుండానే రూ. 1.26 లక్షల విలువైన 1500 షేర్లను అతని పేరిట బదలాయించారు. ఆ తర్వాత మరో 10వేల షేర్లు బదిలీ చేసి రూ.20 లక్షల లాభం వచ్చినట్లు యాప్‌లో చూపించారు. సంబరపడ్డాడు. ఇంకా ట్రేడింగ్ చేద్దామనుకున్నాడు. కాదు..వాళ్లు అలా అలవాటు చేశారు. ఆ తర్వాత రూ.34 లక్షల విలువైన షేర్లను బాధితుడితో కొనిపించారు. లాభాల కోసం తర్వాత షేర్లు విక్రయించేందుకు ట్రై చేశాడు బాధితుడు . అకౌంట్ డీయాక్టివేట్ అని చూపించింది. అంతే. బాధితుడికి నోటి నుంచి మాట రాలేదు. టెన్షన్‌తో ఏం చేయాలో అర్థం కాలేదు. ఆగం ఆగం అయి సోయి లేకుండా అయిపోయింది పరిస్థితి. పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అధిక మొత్తంలో లావాదేవీలు చేసే వ్యక్తులు సైబర్ మోసాల బారిన పడకుండా ఉండటానికి సాంకేతికతను వినియోగించే క్రమంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.